చూడటానికి గంభీరంగా, క్రూర మృగాళ్లగా ఉండే ఈ ఖడ్గమృగాలు (Rhinos) హానీ కలిగించవు..రైనోల గురించి కొన్ని ఆసక్తికర అంశాలు
నేడు ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం (WORLD RHINO DAY)
ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని (WORLD RHINO DAY) ప్రతి ఏటా సెప్టెంబర్ 22న జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాల్లో ఉన్న ఖడ్గమృగాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు, అంతరించి పోతున్న వాటిని సంరక్షించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2010లో దక్షిణ ఆఫ్రికాలో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని (WORLD RHINO DAY) ప్రకటించింది. 2011 నుంచి దీనికి గుర్తింపు లభించింది. ఈ రోజున ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలో కనిపించే వాటిని కాపాడేందుకు ఏయే చర్యలు తీసుకోవాలో సూచిస్తాయి.
ఖడ్గమృగాలు (Rhinos) చూడటానికి గంభీరంగా, క్రూర మృగంలా కనిపిస్తాయి. కానీ ఇవి పెద్దగా హాని కల్గించవు. ఖడ్గమృగాల్లో ప్రధానంగా ఐదు రకాలున్నాయి. వాటిలో ఆఫ్రికాకు చెందిన బ్లాక్ అండ్ వైట్ ఖడ్గమృగాలు (Rhinos), ఒంటికొమ్మువి, ఆసియా, ఇండొనేసియాలోని సుమత్రా, జావాలు కలవు. ఈ జీవుల్లో ఆఫ్రికా, సుమత్రాకి చెందిన వాటికి రెండేసి కొమ్ములు ఉంటాయి. ఇండియా, జావా వాటికి ఒకే కొమ్ము ఉంటుంది.
20 వ శతాబ్దం ప్రారంభంలో 500,000 ఖడ్గమృగాలు (Rhinos) ఆఫ్రికా మరియు ఆసియాలో సంచరించాయి. అయితే ఈ సంఖ్య 1970 నాటికి 70,000 కి పడిపోయింది. అనేక దశాబ్దాలుగా నిరంతర వేట మరియు అడవుల నరికివేత చిత్తడి నేలల తగ్గుదల కారణంగా ఇవి అంతరించిపోతున్నాయి. చాలా తక్కువ ఖడ్గమృగాలు (Rhinos) జాతీయ ఉద్యానవనాలు మరియు అడవుల్లో మనుగడ సాగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 27,000 ఖడ్గమృగాలు (Rhinos) అడవిలో ఉన్నాయి.
ఖడ్గమృగాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలు:
- రైనోలు 2,200 కిలోల నుంచి 2,500 కిలోల బరువు ఉంటాయి.
- వీటి శరీరం భారీగా ఉన్నా భారత దేశానికి చెందిన రైనోలు అయితే గంటకు 55 కిలో మీటర్ల వేగంతో, తెల్ల రైనోలు అయితే గంటలకు 50 కిలో మీటర్ల వేగంతో, నల్లటి రైనోలు అయితే గంటకు 55 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
- ఈ మృగాలు చూడటానికి క్రూరంగా, బలమైన జంతువుల్లా కనిపిస్తాయి. కానీ వీటికి ఇతర జంతువులతో స్నేహంగా ఉండటం ఇష్టం.
- ఖడ్గ మృగాలను ఏ జంతువు దాడి చేయాదు ఎందుకంటే అవి భయపడతాయి. నిజానికి ఇతర జంతువుల కంటే రైనోలకే భయం చాలా ఎక్కువ.
- రైనోలు సైతం ఇతర జంతువులపై ఇవి దాడి చేయవు. కానీ ప్రాణానికే ప్రమాదం అని భావించినప్పుడు ఈ ఖడ్గమృగాలు (Rhinos) బలంగా దాడి చేస్తాయి.
- ఖడ్గ మృగాల కొమ్మల్లో భారీ ఔషధ గుణాలున్నాయని అపోహ పడుతున్నారు. అందుకే వాటిని చంపి వాటి కొమ్ములను తీసుకెళ్తున్నారు. కానీ ఈ కొమ్ముల్లో ఎలాంటి ఔషధ గుణాలు ఉండవు.
- ఈ మృగాల శరీరంపై ఎప్పుడూ పక్షులు వాలి ఉంటాయి. రైనో శరీరంపై ఉండే దోమలు, ఈగలు, పురుగులను ఇవి తింటాయి.
- ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు పక్షులు రైనోలకు అరుస్తూ సందేశాన్ని ఇస్తూ ఎగిరిపోతాయట. అప్పుడు రైనోలు అప్రమత్తమవుతాయి.
- ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఖడ్గమృగాలు (Rhinos) శాఖహారం తింటాయి. గడ్డి, మొక్కలు తింటాయి. ఒకే చోట ఎక్కువ సమయం నిలబడి తింటూ ఉంటాయి.
- వీటికి బురద అంటే మహా ఇష్టం, బురదతో తన శరీరాన్ని కాపాడుకుంటాయి. ఎండవేడి తగలకుండా బురదను శరీరమంతా అంటించుకుంటాయి.
- చివరిగా ఈ మృగాల్లో ప్రత్యేక విషయం ఉంది. దీనికి ఉండే కొమ్ము వెంట్రుకలతో తయారవుతుంది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox