అవినీతి నిరోధక శాఖ(ACB) వలలో మున్సిపల్‌ ఆర్‌ఐ

రూ.15వేలు లంచం తీసుకుంటున్న తరుణంలో ఆర్ఐను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

అమరావతి: అవినీతి నిరోధక శాఖ(ACB) వలలో మరో తిమింగలం పడింది. ఆస్తిపన్ను వేసేందుకు ఓ బాధితుడి నుంచి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్‌ ఆర్‌ఐ షపీవుల్లా రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆస్తిపన్ను వేసేందుకు రూ. 20 వేలు డిమాండ్‌ చేయగా అందుకు బాధితుడు రూ. 15వేలు అందజేస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అవినీతికి పాల్పడ్డ ఆర్‌ఐ షపీవుల్లాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం