ఏపీలో రూ.5 లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి: నితిన్ గడ్కరీ
భువనేశ్వర్ నుంచి భోగాపురం వరకు ఆరు లైన్ల హైవేకు ప్రణాళికలు సిద్ధమన్న కేంద్రం
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో రూ.5 లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజమహేంద్రవరంలో పర్యటించి పలు హైవే ప్రాజెక్టులు, పైవంతెనలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. 2024నాటికి ఏపీలో హైవే ప్రాజెక్టులు పూర్తవుతాయని వెల్లడించారు. వచ్చే 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు మరో రూ.3 వేల కోట్ల ప్రాజెక్టులు అందిస్తామన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..''నౌకాయానంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన రాష్ట్రం. విజయవాడ తూర్పు బైపాస్ మంజూరు చేస్తాం. ఏపీ ప సర్కార్ ముందుకొస్తే లాజిస్టిక్ పార్క్ ఇస్తాం. భువనేశ్వర్ నుంచి భోగాపురం వరకు 6 వరుసల హైవే నిర్మాణం చేపడతాం. రాజమహేంద్రవరం-కాకినాడ కెనాల్ రోడ్ మంజూరు చేస్తాం, ప్రస్తుతం వాయు కాలుష్యం అన్నింటికంటే పెద్ద సమస్య. భవిష్యత్తు అంతా గ్రీన్ ఎనర్జీదే'' అని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox