తెలుగు ప్రజల హృదయాల నుంచి ఎన్టీఆర్ ను చెరపలేరు: జూనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై సినీ నటుడు వ్యాఖ్య

అమరావతి: ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ విశేష ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్‌ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్‌ స్థాయిని తగ్గించదు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్‌ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు'' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం