ఆర్టీసీ పన్నులు చెల్లించలేదని కడప పాత బస్టాండ్ (Kadapa Old Bustand) మూసివేత

రోడ్డుపై బస్సులు అడ్డగింత

కడప: ఆర్టీసీ పన్నులు చెల్లించలేదని ఈమేరకు పాత బస్టాండ్ మూసివేసినట్లు కడప నగరపాలక సంస్థ అధికారులు వెల్లడించారు. కడప పాత బస్టాండ్ (Kadapa Old Bustand) బస్సులు రాకుండా నగరపాలక సంస్థ గురువారం అడ్డుకుంది.  రెండు కోట్లు బకాయిలను ఆర్టీసీ ఏళ్ల తరబడి చెల్లించలేదని కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు నోటీసులు ఇచ్చామని దానికి కూడా స్పందన లేదని ఆయన పేర్కొన్నారు. అందుకే పాత బస్టాండ్ ను మూసివేస్తున్నాము అని అన్నారు. ఆర్టీసీ పన్నులు చెల్లించలేదని కార్పొరేషన్ ఈ చర్యలకు ఉపక్రమించగా, దీంతో బస్సులు రోడ్డుపై నిలిచిపోయారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులు రోడ్డుపైనే నిలిచిపోవడంపై  ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం