శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కు తగ్గిన వరద ప్రవాహం.. గేట్ల మూసివేత

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు

గమెండోరా: శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రభావం తగ్గింది. ఈ మేరకు అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేస్తున్నట్లు తెలిపారు ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలు కాకతీయకు 2500 క్యూసెక్యులు, వరద కాలువకు 3000 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 200 క్కూసెక్యులు, సరస్వతీ కాలువకు 100 క్యూసెక్కులు, మంచినీటి అవసరాలకు, ఆవిరి రూపంలో 780 క్యూసెక్కుల నీరువిడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 90 టిఎంసిలు ఉండగా శుక్రవారం సాయంత్రం వరకు 1090.90 అడుగులు 89.763 టిఎంసిలుగా ఉందని ప్రాజెక్టు ఏఈ వంశీ తెలిపారు. కాగా, గత ఏడాది ఇదే రోజున ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు 90.313 టిఎంసిలుగా ఉందని అధికారులు తెలిపారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం