చేపల వల కాళ్లకు చుట్టుకుని వ్యక్తి మృతి

చేగుంటలో విషాదకర ఘటన

చేగుంట: చేపలు పట్టడానికి చెరువులోకి దిగి వ్యక్తి మృతి చెందిన ఘటన చేగుంట మండలం పులిమామిడి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం…పులిమామిడి గ్రామ పంచాయతీ కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఎ. ప్రతాఫ్‌రెడ్డి(48) చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళి కాళ్లకు వల చుట్టుకోవడంతో చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. అతని భార్య అల్ల మణెమ్మ ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామని వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox