ఆలస్యంగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia)రెండో టీ20

వర్షం కారణంగా మరింత ఆలస్యంగా ప్రారంభం కానున్న మ్యాచ్

నాగ్ పూర్: భారత్ (India), ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా ఆలస్యం కానుంది. ఈ మ్యాచ్ కు వేదికైన నాగపూర్ లో గతరాత్రి వర్షం కురియడంతో మైదానం చిత్తడిగా మారింది. దాంతో ఇప్పటివరకు టాస్ కూడా వేయలేదు. 7 గంటలకు పరిస్థితిని అంపైర్లు పరిశీలించగా పిచ్ సిద్ధంగా లేదని తెలిపారు. ఎనిమిది గంటలకు మరోసారి పిచ్ ను పరిశీలిస్తారు. అనంతరం మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

పిచ్ పై కవర్లు కప్పినప్పటికీ, అవుట్ ఫీల్డ్ లో ఒకట్రెండు చోట్ల తేమ శాతం అధికంగా ఉన్నట్లు అంపైర్లు తెలిపారు. మరికాసేపట్లో టాస్ వేయనున్నారు. కాగా, ఈ మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా నెగ్గడం తెలిసిందే. దాంతో ఆ జట్టు సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ (India)కు సిరీస్ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో నాగపూర్ లో హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. కాగా, ఇప్పుడు మ్యాచ్ సాగేందుకు ఛాన్స్ లేకపోతే మాత్రం చివరి టీ20 కీలకం కానుంది. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం