దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గా ఎం.శ్రీనివాస్ నియామకం

రణదీప్ గులేరియా పదవీ విరమణ నేపథ్యంలో శ్రీనివాస్ కు అవకాశం

న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ప్రతిష్ఠాత్మక వైద్య విశ్వవిద్యాలయం ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు నూతన డైరెక్టర్ గా ఎం. శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రస్తుతం ఈ పోస్టులో కొనసాగుతున్న రణదీప్ గులేరియా నేటితో పదవీ విరమణ చేయనున్నారు.

గులేరియా పదవీ విరమణతో ఖాళీ కానున్న స్థానంలో ఎం శ్రీనివాస్ నియమితులయ్యారు. దిల్లీ ఎయిమ్స్ కు కొత్త డైరెక్టర్ గా నియమితులైన ఎం. శ్రీనివాస్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఈఎస్ఐ ఆసుపత్రి డీన్ గా శ్రీనివాస్ పనిచేస్తున్నారు. గతంలో దిల్లీ ఎయిమ్స్ లోనే పీడియాట్రిక్స్ విభాగంలో పనిచేసిన శ్రీనివాస్ 2016లో హైదరాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి డీన్ గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ హోదాలో ఆయన తిరిగి దిల్లీకే ఆయన వెళ్లనున్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox