ప్రతిపక్షాలకు ఈడీ పేరిట వేధింపులు ఎదురవుతున్నాయి: భట్టి

ఈ కేసులకు కాంగ్రెస్ నేతలు భయపడిపోరన్న భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఈడీ నోటీసులపై టీసీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తాజాగా స్పందిస్తూ.. ఈ కేసులకు కాంగ్రెస్ నేతలు భయపడిపోరని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ కు  చెందిన తెలంగాణ నేతలకు ఎన్ ఫోర్ప్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ టీపీసీసీ నేతలకు ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా దీనిపై భట్టీ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు కుట్రతోనే కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ తరహా వేధింపులు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నిత్యం ఎదురౌతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలకు ఈడీ పేరిట వేధింపులు ఎదురవుతున్నాయని అన్నారు. అయితే ఈ తరహా కేసులకు కాంగ్రెస్ నేతలు భయపడిపోరని భట్టి విక్రమార్క అన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం