కొబ్బరి వడలు ఇలా తయారు చేసుకోండి

కావలసినవి, తయారీ విధానం

కావలసినవి: జీలకర్ర – 1 టీ స్పూన్‌, కొబ్బరి కోరు – అర కప్పు, బియ్యం – 1 కప్పు (నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టాలి), బియ్యప్పిండి – 1/3 కప్పు, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం: ముందుగా మిక్సీ బౌల్‌లో నానబెట్టిన బియ్యం, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొబ్బరికోరు, ఉప్పు వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమంలోకి బియ్యప్పిండి వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక అరటి ఆకుపైన లేదా మందంగా ఉండే ప్లాస్టిక్‌ కవర్‌ మీద చిన్నచిన్న ఉండల్ని అప్పడాల్లా ఒత్తుకుని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇవి నూనెలో పడగానే పూరీల్లా పొంగుతాయి. అంతే కొబ్బరి వడలు తయారైనట్లే వేడివేడిగా తింటే సూపరో సూపర్.. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం