దేశంలో కొత్తగా 4,129 కరోనా కేసులు నమోదు

కరోనా బారిన పడి తాజాగా 20 మంది మృతి

న్యూదిల్లీ: దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,129 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో తాజాగా 20 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 5,28,530 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4688 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కులుపుకుని దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,72,243 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 43,415 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 89.1 శాతంగా ఉంది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,40,00,298 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.17 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 11 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం