పరీక్షలో తప్పు చేశాడని విద్యార్థిని చావ‌బాదిన టీచ‌ర్.. విద్యార్థి మృతి

ఉత్తరప్రదేశ్ లోని ఔరియ‌లో ఘటన

లక్నో: ప‌రీక్ష‌లో త‌ప్పు చేశాడ‌ని విద్యార్ధిని ఉపాధ్యాయుడు చావబాదగా చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన  ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్ లోని ఔరియ‌లో చోటుచేసుకుంది. బాధితుడు నిఖిల్ దోహ్రే సెప్టెంబ‌ర్ 7న జ‌రిగిన ప‌రీక్ష‌లో త‌ప్పు చేశాడ‌నే నెపంతో చితకబాదాడు. దీంతో బాలుడి ఆరోగ్యం క్షీణించింది. ఈ మేరకు విద్యార్థిని ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు.

సెప్టెంబ‌ర్ 24న నిఖిల్ తండ్రి రాజు దోహ్రే అచ‌ల్ధ పోలీస్ స్టేష‌న్‌లో టీచ‌ర్‌పై ఫిర్యాదు చేశాడు. బాలుడి వైద్యానికి సాయం అందించ‌డం లేద‌ని, కులం పేరుతో త‌మ‌ను దూషిస్తున్నాడ‌ని ఆరోపించాడు. దీంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడు అశ్వ‌ని సింగ్ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు ఔరియా ఎస్పీ చారు నిగం మాట్లాడుతూ..  నిందితుడిని అరెస్ట్ చేసేందుకు మూడు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని, బాలుడి మృతి కేసుపై ద‌ర్యాప్తున‌కు ఆదేశించామ‌ని వెల్ల‌డించారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం