ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ (Acharya Konda Laxmana Bapuji) జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం ‌

తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆది గురువు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ

స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆది గురువు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ (Acharya Konda Laxmana Bapuji) 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాద్ జిల్లా వాంఖిడి గ్రామంలో జన్మించారు. ఆ తరుణంలో తెలంగాణలో రెండు ఉద్యమ పోరాటాలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ఒకటి భారత స్వాతంత్ర పోరాటం, రెండు నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటం. బాపూజీకి కొంత వయస్సు వచ్చిన నాటి నుంచి ఈ రెండు పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ (Acharya Konda Laxmana Bapuji) చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తల్లి చనిపోయాక స్థానికంగానే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన పై చదువుల కోసం హైదరాబాద్ చేరుకుని అక్కడ న్యాయవాద విద్యను పూర్తి చేశారు. అనంతరం 1940లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. బాపూజీ సతీమణి శాకుంతల ఆమె వృత్తి రిత్యా వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. కుమారుడు భారతీయ వాయుసేనలో పనిచేసి వీరమరణం పొందారు. ఇదిలా ఉండగా, వృత్తి రిత్యా న్యాయవాది అయిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ( Konda Laxmana Bapuji).. నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడిన వారిని జైలుకు పంపే క్రమంలో బాపూజీ వారిని బయటకు తీసుకువచ్చేవారు. దీంతో నిజాం ప్రభువుకు బాపూజీపై వ్యతిరేక భావం ఏర్పడింది. దీంతో ఆయనను వేదించటం మొదలు పెట్టారు. నిజాం ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా ఆయన బెదిరేవారు కాదు. కాగా, దేశం మొత్తం క్విట్ ఇండియా ఉద్యమం ఉద్ధృతంగా మొదలైంది. 

ఆ ఉద్యమానికి తెలంగాణలో బాపూజీ ముందుండి నడిపించారు. అనంతరం 1947లో భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇకవైపు దేశమంతా స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో హైదరాబాద్ రాజ్యంలో మాత్రం నిజం ప్రభుత్వ నిరంకుశ పాలనలో కొసాగుతుంది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ విమోచనోద్యమంలో కూడా బాపూజీ పాల్గొన్నారు. 1947 డిసెంబర్ 4 నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణ రావు బృందంలో కొండా లక్ష్మణ్ కూడా ఉన్నారు. బాంబు దాడి అనంతరం కొండా లక్ష్మణ్ అజ్ఞాతంలో ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు.

నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తర్వాత 1952లో భారత ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఆయన అసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 1957లో చినకొండూరు నుంచి విజయం సాధించి డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. 1962 ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. తర్వాత ప్రత్యర్థిపై కేసు వేసి అక్రమంగా గెలిచాడని నిరూపించి విజయం సాధించారు. 1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. 1957 నుంచి 1960 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్ గా అనంతరం దామోదరం సంజీవయ్య క్యాబినెట్ లో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, కాసుబ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో కార్మీక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

బాపూజీ తన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర చేనేత సహకార రంగ అభివృద్ధికి విశేష కృషి చేశారు. 1969లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామ చేశారు. 1972లో మళ్లీ భువనగిరి నుంచి విజయం సాధించారు. పీవీ నరసింహరావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తృటిలో తప్పిపోయింది. ఇందిరా గాంధీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు సమ్మతించినా కేంద్రంలో కొందరి లాభీయింగ్ వల్ల బాపూజీకి ఆ అవకాశం దక్కలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలహీన వర్గం నుంచి ఎదుగుతున్న బాపూజీని అడ్డుకోవటానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఉద్ధండులైన నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి తదితరులు ఆయనను ముఖ్యమంత్రి కానివ్వకుండా వారు ఇందీరాగాంధీని పలువిధాలుగా ఒప్పించి అడ్డుకున్నారు.

బాపూజీ ముఖ్యమంత్రి కాకుండా చేస్తున్న కుట్రలను గమనించిన ఆయ తాను నమ్మిన బహుజన వాదాన్ని సజీవ పర్చుకోడానికి దళిత వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి తీవ్రంగా కృషి చేశారు. తెలుగు రాష్ట్రంలో తొలిసారి, చివరిసారి ఒక దళిత ముఖ్యమంత్రి కల బాపూజీ ద్వారా జనవరి 11, 1960 లో సాకారమైంది. అయితే సంజీవయ్యను రెండేళ్లకు మించి ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోనివ్వలేదు. సెప్టెంబర్ 22, 2012లో 97 ఏడేళ్ల వయసులో ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలదృశ్యంలో జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ ( Konda Laxmana Bapuji) పేరు పెట్టడం విశేషం.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం