రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదు: మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ (NTR) పేరు మార్పుపై యార్లగడ్డ నిర్ణయం
విజయవాడ: వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ (NTR) పేరు మార్చి..వైఎస్సార్ (YSR) పేరు పెట్టడం సబబు కాదని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (Yarlagadda laxmiprasad) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... భాషాభివృద్ధికి పదవే అవసరం లేదు, పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి కృషి చేస్తాను. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం కారణంగా తనకున్న మూడు పదవులకు రాజీనామా చేశానని... అదే రోజు రాజీనామా పత్రాలు అధికారులకు పంపినట్లు తెలిపారు. పేరు మార్చడం నచ్చలేదు, రాజీనామా చేసి బయటకు వచ్చేసా.
రాజీనామాపై వెనుకడుగు వేసేది లేదు. మళ్లీ తీసుకోమన్నా .. నేను వద్దనే చెబుతాను. ''నిన్న ఒక దినపత్రికలో స్వరం మార్చిన యార్లగడ్డ (Yarlagadda Laxmiprasad) అని వార్త ఇచ్చారు. ఆ పత్రిక యజమాన్యానికి లేఖ ద్వారా స్వరం మార్చలేదు, రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదు.లేఖ రాశాక ఇవాళ సవరణ అని వార్త ఇస్తారనుకున్న కానీ సవరణ ఇవ్వకుండా తిడుతున్నట్లు వార్త ఇచ్చారు. రాజీనామా చేసి జగన్ (Jagan mohan reddy)ను తిడుతున్నారెందుకు అని అమెరికా నుంచి కూడా అడుగుతున్నారు. నేనెప్పుడూ జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు.
లక్ష్మీపార్వతి (Laxmiparvati) వ్యాఖ్యలు ఆమె ఇష్టం.. నేను స్పందించను. కొత్తగా ఏర్పడిన ఏపీ (Andhrapradesh)లో రాజధానికి ఎన్టీఆర్ పేరు వచ్చేలా పెట్టాలని ఎప్పుడో చెప్పాను. ఆనాటి ప్రభుత్వం అమరావతి (Amaravati) అని పేరు పెట్టింది. దేవేంద్రుడు రాజధాని అమరావతి.. ఆ పేరు ఏపీకి ఎందుకు. నేను మాట మార్చలేదు... నిర్ణయం మార్చుకోలేదు. సందేహాలు ఉంటే నా నంబర్ 9849067343కి కాల్ చేస్తే అన్ని ఆధారాలు ఇస్తా. ఇకనైనా నాపై అబద్దపు ప్రచారాలు ఆపాలని కోరుతున్నా'' అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox