దేశంలో తగ్గిన కరోనా కేసులు...32 మరణాలు నమోదు

కొత్తగా 3,230 కరోనా కేసులు

న్యూదిల్లీ: దేశంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 3,230 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,72,243 కు చేరింది.ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 42,358 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,255 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 89.1 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 32 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 5,28,562 కి చేరింది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,40,04553 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.17 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 14 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లను ఆరోగ్య శాఖ వేసింది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం