రైతుల పాదయాత్రను ఒళ్లు బలిసినవారి పాదయాత్రగా అభివర్ణించిన మంత్రి అంబటి

కృష్ణా జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి

కృష్ణా జిల్లా: అమరావతి రైతులు చేపడుతున్న పాదయాత్రను ఒళ్లు బలిసినవారి పాదయాత్రగా ఏపీ మంత్రి అంబటి బాబు అభివర్ణించారు. ఈ మేరకు రాజకీయ దుమారం అంటుకుంది. అమరావతినే రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర తెలిసిన విషయమే. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేయూత నగదు చెక్కులను పంపిణీ చేసిన అనంతరం మంత్రి అంబటి ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంపాదన ఎక్కువై ఒళ్లు బలిసిపోయి ఉన్న కొంత మంది తమ బలుపును తగ్గించుకోవాలన్న ఆరాటంతో ఇలా పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉన్న ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిందని చెప్పారు. దీనిని సహించలేని కొందరు బలిసినోళ్లు, కోటీశ్వరులు పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.

కొందరు ఏదో చేస్తామనుకుని తొడలు కొడుతున్నారని, అలా తొడలు కొట్టినంత మాత్రాన వికేంద్రీకరణ నిలిచిపోదన్నారు. ఇప్పటికే కుప్పంలో వైసీపీ పైచేయి సాధించిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్‌ బాబు, దివి ఏఎంసీ చైర్మన్‌ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం