ముగ్గురు ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టుల ప్లాన్ ?

మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా

కరీంనగర్‌: ముగ్గురు ఎమ్మెల్యేల హత్యకు మావోయిస్టులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మావోయిస్టుల కదలికపై నిఘా ఉంచారు. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు అలజడికి వేసిన ప్రణాళికను నిఘావర్గాలు, పోలీసులు ముందుగానే గుర్తించారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌ను హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. కానీ,మావోయిస్టులు ఎలాంటి హింసకూ పాల్పడలేదు. రాష్ట్రస్థాయి నాయకులు ప్రవేశించినప్పటికీ హింసకు పాల్పడకపోవడం వెనుక టైమ్‌బాంబు తరహాలో దాడి చేసి నింపాదిగా తప్పించుకునే వ్యూహం దాగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox