తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెస్, భాజపాకి కళ్లు మండుతున్నాయి : గంగుల కమలాకర్

ఆ విషానికి విరుగుడు సీఎం కేసీఆరేనన్న గంగుల కమలాకర్

కరీంనగర్: తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలకు కళ్లు మండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) పేర్కొన్నారు. దిల్లీ పార్టీలు (Delhi Parties) తెలంగాణ (Telangana)పై విషం చిమ్ముతున్నాయన్నారు. ఆ విషానికి విరుగుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని గంగుల పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపా అధికారంలోకి వస్తే నీళ్లు, కరెంట్ ఎత్తుకుపోతారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ లేకుంటే భవిష్యత్ తరాల జీవితాలు అంధకారంగా మారుతాయని గంగుల పేర్కొన్నారు.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox