నవంబర్ నెలలో మునుగోడు ఉపఎన్నిక ?

ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ నెలలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉప ఎన్నికల (By Election) నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు.  దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ (Notification) వెలువడనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు ఈవీఎం (EVM)లతో పాటు అవసరమైన ఏర్పాట్లు ఈసీ పూర్తి చేస్తోంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఈసీఐ (ECI) ఆదేశించింది. దీంతో నల్గొండ జిల్లా కలెక్టర్, అధికారులు ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox