హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా మరికొన్నిరోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతడికి 6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఇటీవల యూఏఈలో మోకాలి గాయానికి గురైన రవీంద్ర జడేజా ఇప్పటికే వరల్డ్ కప్ కు దూరం కాగా, ఇప్పుడు బుమ్రా కూడా గాయాలపాలై ప్రపంచకప్ కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా బుమ్రా స్థానంలో వరల్డ్ కప్ కు ఎవరిని తీసుకునేది బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. కాగా, ఇటీవల బుమ్రా ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్ లో ఆడి భారీగా పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా 50 పరుగులు ఇచ్చాడు. గాయంతో బాధపడుతుండడంతో అతడిని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు కూడా ఎంపిక చేయలేదు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox