పార్టీని వీడేది లేదన్న సినీ నటుడు అలీ

జనసేనలో చేరడంపై అలీ క్లారిటీ

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, వైయస్సార్ పార్టీ నాయకుడు అలీ పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో వెళ్లబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై అలీ స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతోనే తాను వైసీపీలో పనిచేశానని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని జగన్ మనసులో స్థానం ముఖ్యమన్నారు. కొందరు కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని.. తాను వైయస్సార్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీలో అంకితభావంతో పనిచేస్తానని అలీ స్పష్టం చేశారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం