భారత్‌ కు వెళ్లొద్దన్న కెనడా ప్రభుత్వం.. ప్రయాణికులకు హెచ్చరిక

లడఖ్‌ను మినహాయించిన కెనడా

ఒట్టావా: పాకిస్తాన్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత రాష్ట్రాలకు వెళ్లొద్దని కెనడా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు భారత్‌ వెళ్లే తమ ప్రయాణికులకు కెనడా హెచ్చరించింది.  ఈమేరకు సెప్టెంబర్‌ 27న చివరిసారిగా అప్‌డేట్‌ చేసిన కెనడా ప్రభుత్వం ట్రావెల్‌ అడ్వైజరీలో పేర్కొంది. ల్యాండ్‌మైన్‌లు, అనూహ్య భద్రతా పరిస్థితుల రిత్యా పాకిస్థాన్‌ సరిహద్దుగా కలిగిన రాష్ట్రాలైన గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లకు వెళ్లవద్దని కెనడా తన పౌరులకు సూచించింది. దేశమంతటా తీవ్రవాద దాడుల ముప్పు కారణంగా భారత్‌ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌ను మినహాయించింది. ఉగ్రవాదం, చొరబాటుదారుల నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో మణిపూర్‌, అసోంలకు వెళ్లకుండా ఉండాలని కెనడా సూచించింది. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం