రేపు మర్లపేల్లి గ్రామంలో మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ

ప్రజలందరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న అధ్యక్షులు నిఖిల్ కుమార్

ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ మండలం మర్లపేల్లి గ్రామంలో శుక్రవారం శ్రీ మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు గ్రామస్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు వీరశైవ లింగాయత్ లింగ బలిజా సంఘం మర్లపేల్లి అధ్యక్షులు నిఖిల్ కుమార్ మాట్లాడుతూ.. శుక్రవారం శ్రీ మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ చేపట్టేందుకు గ్రామస్థులందరం కలిసి నిర్ణయించామన్నారు. రేపు మధ్యాహ్నం 12:09 గంటలకు విగ్రహా ఆవిష్కరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. బోథ్ మండలంలోని వీరశైవులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నామని అధ్యక్షుడు నిఖిల్ కుమార్ వెల్లడించారు. వివరాలకు 9177728957, 9493028513, 7989890698 నంబర్లకు సంప్రదించాలని వెల్లడించారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox