రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటన.!

అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ (National Party) ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు జాతీయ పార్టీ ప్రకటనకు ముందు లక్ష్మీ నరసింహ స్వామి (Lakshmi  Narasimha Swamy)ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. 

సమావేశంలో జాతీయ పార్టీపై కార్యవర్గం తీర్మానం చేయనుంది.5వ తేదీకి ముందే సిద్దిపేట జిల్లా కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేయనున్నారు. అంతేకాకుండా  కేసీఆర్ మొత్తం నాలుగు పేర్లను పరిశీలిస్తున్నారు. వీటిలో భారతీయ రాష్ట్ర సమితి (BRS) పేరుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox