అనారోగ్య కారణాలతో తల్లీ, కూతుళ్లు ఆత్మహత్య.!

ఆరో అంతస్తు పైనుంచి దూకిన తల్లీ, కూతుళ్లు

అమరావతి: అనారోగ్య కారణాలతో తల్లీ, కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  గొల్లపూడిలో చోటుచేసుకుంది. తల్లీ, కూతుళ్లు బొప్పన సత్యవతి, కందుల మాధవి ఆరో అంతస్తు నుంచి కిందకు దూకడంతో అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిఐ ఉమర్ మాట్లాడుతూ... తల్లి సత్యవతి, ఆమె కుమార్తె మాధవి ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ముందుగా నిర్ణయించుకునే ఇద్దరూ అపార్టుమెంట్ వద్దకు వచ్చారన్నారు. లిప్ట్‌లో పైకివెళ్లి ఆరో అంతస్తు నుంచి కిందకి దూకారని తెలిపారు. అనారోగ్య కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, దర్యాప్తు పూర్తి అయ్యాక అన్ని వివరాలు‌ వెల్లడిస్తామని సిఐ ఉమర్ అన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం