ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్ల‌పై ఫిర్యాదు చేసిన హీరో మంచు విష్ణు

ట్రోలింగ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశానన్న మంచు విష్ణు

హైదరాబాద్: టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు గురువారం సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌పైనా, త‌న కుటుంబ స‌భ్యుల‌పైనా సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోలింగ్ జ‌రుగుతోంద‌ని, ఆ ట్రోలింగ్‌కు కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను కోరినట్లు విష్ణు తెలిపారు. మొత్తంగా 18 యూట్యూబ్ ఛానెళ్ల‌ను త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు విష్ణు వెల్లడించారు.

త‌న‌పై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా ఓ వాట్సాప్ గ్రూప్‌నే క్రియేట్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. సాధార‌ణంగా తాను ట్రోల్స్ పెద్ద‌గా పట్టించుకోనన్న విష్ణు... జ‌వాబుదారీత‌నం కోస‌మే కేసులు పెడుతున్నాని వెల్ల‌డించారు. త‌న‌కు ప్ర‌స్తుతానికి సినిమా థియేట‌ర్ల స‌మ‌స్య లేదన్న విష్ణు త‌న‌కు అన్యాయం జ‌రిగితే మాట్లాడ‌టానికి వెనుకాబోన‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో కార్యాల‌యం నుంచే త‌న‌పై ట్రోలింగ్ జ‌రుగుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం