యాదాద్రికి కేజీ 16 తులాల బంగారాన్ని కానుకగా అందజేసిన కేసీఆర్ మనుమడు హిమాన్షు

యాదాద్రి శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్

యాదాద్రి భువ‌న‌గిరి: యాదాద్రి శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. కుటుంబ స‌మేతంగా ద‌ర్శ‌నానికి వ‌చ్చిన కేసీఆర్‌కు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంతరం ఆల‌య దివ్య విమాన గోపుర‌మున‌కు బంగారు తాపడం నిమిత్తమై కేసీఆర్ మనుమడు హిమాన్షు కేజీ 16 తులాల బంగారాన్ని ఆలయ అధికారులకు  విరాళంగా అందజేశారు. పూజ‌ల అనంత‌రం కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌ను ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు జ‌గ‌దీశ్ రెడ్డి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎంపీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, గొంగిడి సునీత‌, సుధీర్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, వైటీడీఏ చైర్మ‌న్ కిష‌న్ రావు, ఆల‌య ఈవో గీతా రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదాద్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. భద్రతా కారణాలతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం