కాబూల్ (Kabul) లో ఆత్మాహుతి దాడి.. 100 మంది విద్యార్థులు మృతి

హజారా వర్గానికి చెందిన వారిని దృష్టిలో ఉంచుకుని దాడులు.!

కాబూల్ (Kabul): ఆప్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్ (Kabul)‌లో రక్తం ఏరులై పారింది.  కాబూల్ (Kabul) లో ఆత్మాహుతి దాడి జరిగి 100 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ద‌స్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతుండగా, ఈ పేలుడు సంభ‌వించిన‌ట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ పేలుళ్ల‌పై స్థానిక జ‌ర్న‌లిస్ట్ బిలాల్ స‌ర్వారీ ట్వీట్ చేస్తూ... ఆత్మాహుతి దాడి ఘటనలో 100 మంది విద్యార్థులు చ‌నిపోయినట్లు వెల్లడించింది. అంతే కాకుండా  మృతుల సంఖ్య మరింత పెరిగే అవ‌కాశం ఉన్నట్లు బిలాల్ సర్వారీ వెల్లడించారు. విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష రాస్తుండ‌గా పేలుడు సంభ‌వించిన‌ట్లు జ‌ర్న‌లిస్టు పేర్కొన్నాడు.

విద్యార్థుల శ‌రీర భాగాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయ‌ని, విద్యార్థులు కూర్చున్న తరగతి గదుల్లో రక్తం ఏరులై పారిందని ఆయన స్పష్టం చేశారు. హ‌జారా మైనార్టీ వ‌ర్గానికి చెందిన వారు అక్కడ ఎక్కువగా ఉన్న‌ారని, గ‌తంలోనూ ఆ వ‌ర్గంపై దాడులు జ‌రిగాయని తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుత దాడికి బాధ్య‌త ఎవ‌రూ ప్ర‌క‌టించలేదు. కాగా, ఆఫ్ఘాన్ లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు పౌరప్రభుత్వాన్ని కూలదోల్చి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే హజారా వర్గానికి చెందిన వర్గీయులపై వరుస దాడులు జరుగుతున్నాయి. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం