సైబరాబాద్ లో నలుగురు దొంగల అరెస్టు

నిందితుల వద్ద నుంచి 3.5 తులాల బంగారం, ఆటో స్వాధీనం

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఒకే కుటుంబానికి చెందిన యాదయ్య, మహదేవ్, రేణుక, అనిత అరెస్టయ్యారు. పట్టుబడిన ఈ నలుగురు నిందితులు పాత నేరస్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ నిందితులపై నగరంలోని మియాపూర్, రామచంద్రాపురంలో 12 నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. యాదయ్య అనే నిందితుడిపై చందానగర్ లో పీడీ యాక్ట్ నమోదైందని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 3.5 తులాల బంగారం, ఆటో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు.  


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం