రేపు 5జీ సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దిల్లీలో జరిగే మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో 5జీ ప్రారంభం

న్యూదిల్లీ: దేశంలో 5జీ సేవలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (శనివారం) ప్రారంభించనున్నారు. దిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే ఆరవ విడత ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఈ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రస్థుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. వచ్చే రెండేళ్లలో యావత్ దేశమంతా 5జీ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

2035 నాటికి భారత్ 450 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో 5జీ ముఖ్య పాత్ర వహిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 5జీ తో కొత్త ఆర్థిక వ్యవస్థలు, సామాజిక పురోగతి పెంపొందుతుందని తెలిపాయి. అలాగే నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు మరింత ముందుకెళ్తాయని అన్నారు. డిజిటల్ ఇండియా విజన్ ను చేరుకోడానికి ఇవి దోహదం చేస్తాయని పేర్కొన్నాయి. చైనా తర్వాత స్మార్ట్ ఫోన్లకు అతిపెద్ద మార్కెట్ భారత్ దేనన్న మోదీ 5జీ రాక ఎన్నో అవకాశాలకు నాంది కానుందని ఆయన వెల్లడించారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox