త్రివిధ దళాధిపతిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనిల్ చౌహాన్‌

భార‌త రెండ‌వ సీడీఎస్‌గా కేంద్ర ప్ర‌భుత్వం అనిల్ చౌహాన్ కు అవకాశం

న్యూదిల్లీ: భారత త్రివిధ దళాధిపతిగా (సీడీఎస్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్ శుక్రవారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణానంతరం దాదాపు 9 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ అత్యున్నత స్థానానికి అనిల్‌ చౌహాన్‌ను ఎంపిక చేసినట్టు బుధవారం కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు భార‌త రెండ‌వ సీడీఎస్‌గా కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న్ను నియ‌మించిన విష‌యం తెలిసిందే. దిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఆయ‌న‌కు గౌర‌వ వంద‌నం ల‌భించింది. రెండ‌వ సీడీఎస్‌గా ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంతరం ఆయన దిల్లీలోని జాతీయ యుద్ధ స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా సీడీఎస్  అనిల్ చౌహాన్‌ మాట్లాడుతూ.. భార‌త సైనిక ద‌ళాల్లో అత్య‌ధిక ర్యాంకు ద‌క్క‌డం గ‌ర్వంగా ఉంద‌నిఅన్నారు. త్రివిధ ద‌ళాల ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లుగా ప‌నిచేయ‌నున్న‌ట్లు సీడీఎస్ అనిల్ చెప్పారు. అన్ని స‌వాళ్ల‌ను, అవ‌రోధాల‌ను క‌లిసిక‌ట్టుగా ఎదుర్కోనున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కాగా, రక్షణశాఖ, మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ అనిల్ చౌహాన్‌ వ్యవహరిస్తారని ప్ర‌భుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఏడాది మేలో ఈస్టర్న్‌ కమాండర్‌గా పదవీ విరమణ చేసిన లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (61).. 40 ఏండ్ల సర్వీసులో సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేశారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox