టీ20 సిరీస్‌కు మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌ ఎంపిక

ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌ కు బుమ్రా స్థానంలో సిరాజ్‌

ముంబయి: టీ20 సిరీస్ కు మహమ్మద్ సిరాజ్ ను బీసీసీఐ చేసింది. పేస్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ మేరకు బుమ్రా స్థానంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌కు మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌ను తీసుకున్నారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి వ‌న్డేలో బుమ్రా ఆడలేదు. ఇక మిగిలిన రెండు టీ20ల‌కు అత‌ని స్థానంలో హైద‌రాబాదీ స్పీడ్‌స్ట‌ర్ సిరాజ్‌ను ఎంపిక చేశారు.

ఇదిలా ఉండగా, బుమ్రా వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఈ మేరకు బుమ్రాకు విశ్రాంతి అవసరమైన వైద్యులు సూచించడంతో బీసీసీఐ అతనికి విశ్రాంతినిచ్చింది. మరోవైపు కీల‌క‌మైన వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యంలో బుమ్రా గాయ‌ప‌డ‌డం కొంత ఆందోళ‌న క‌లిగించగా, ఆయన వరల్డ్ కప్ కు దూరమయ్యారు. అక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం