రేపు తెలంగాణలో భారీ వర్షాలు.!

హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా శనివారం సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వానలు  కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం