విద్యార్థులు, కూలీలే లక్ష్యంగా హెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

కొండాపూర్ లో 48 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్ ను విక్రయిస్తున్న సింతులాలాను కొండాపూర్లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 48 గ్రాముల హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు విద్యార్థులు, దినసరి కూలీలే లక్ష్యంగా హెరాయిన్ ను విక్రయిస్తున్నాడని వెల్లడించారు. సింతులాలా పశ్చిమ బెంగాల్ నుంచి హెరాయిన్ తీసుకువచ్చి బాధితులకు విక్రియస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు సింతులాలాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం