ఉక్రెయిన్లోని 4 ప్రాంతాలు రష్యాలో విలీనం: పుతిన్

పుతిన్ ప్రకటన పనికిరానిదన్న జెలెన్ స్కీ

మాస్కో: ఉక్రెయిన్లోని 4 ప్రాంతాలు రష్యాలో విలీనం కానున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. నాలుగు ప్రాంతాల విలీన ప్రక్రియ వచ్చేవారం రష్యా పార్లమెంటు ఆమోదించనున్నట్లు అధ్యక్షుడు వాద్లమిర్ పుతిన్ ప్రకటించారు. నాలుగు ప్రాంతాల విలీనంపై అధ్యక్షుడు పుతిన్ ఒప్పందాన్ని రష్యా పార్లమెంటు ఆమోదించనుంది. ఉక్రెయిన్ కు చెందిన 15 శాతం భూభాగం రష్యాలో కలవనుందని పుతిన్ ఈ మేరకు స్పష్టం చేశారు. అంతే కాకుండా మా భూభాగాలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్దంగా ఉన్నామని అధ్యక్షుడు వెల్లడించారు. ఇదిలా ఉండగా, పుతిన్ ప్రకటన పనికిరానిదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ధ్వజమెత్తారు. వాస్తవాలను ఎవరూ మార్చలేరని అన్నారు.  

 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం