యాదాద్రి ఆలయ అర్చకులు, ఉద్యోగుల ఇళ్లకు 2,157 ఎకరాలు కేటాయింపు: కేసీఆర్

రూ.43 కోట్లతో యాదాద్రి అభివృద్ధి.. వెంటనే మంజూరు: సీఎం కేసీఆర్‌

యాదాద్రి భువనగిరి: రూ.43 కోట్లను యాదగిరిగుట్ట అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రిని దర్శించుకున్నారు. అనంతరం వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 100 ఎకరాల్లో నృసింహ అభయారణ్యం ఏర్పాటు చేస్తామని, 50 ఎకరాల్లో కల్యాణ మండపం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. 250 ఎకరాల్లో కాటేజీల నిర్మాణం చేపడుతామన్నారు.

వైటీడీఏకు 2,157 ఎకరాలు అప్పగిస్తామని, ఇందులో ఆలయ అర్చకులు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు తెలిపారు. దాతలకు కాటేజీ నిర్మాణాలకు ఇచ్చే విరాళాలకు ఐటీ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. యాదాద్రిలో హెలిప్యాడ్‌ నిర్మించాలని ఆదేశించారు. యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ ఉండేలా అనుబంధ నిర్మాణాలు చేపట్టాలని వైటీడీఏను ఆదేశించారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం