మిర్యాలగూడలో ఇంటిపై పిడుగు.. కాలి బూడిదైన విద్యుత్ తీగలు

భయబ్రాంతులకు గురైన స్థానికులు

నల్గొండ: ఇంటిపై పిడుగు పడిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని బంగారుగడ్డ మైసమ్మ గుడి పక్కన తన్నీరు సైదులు తండ్రి నర్సంహ ఇంటిపై పిడుగు పడింది. ఇంటిగోడ దెబ్బతినడంతో పాటు మొత్తం విద్యుత్ తీగలు కాలి బూడిదయ్యాయి. ఇంటిలోని సామాగ్రి కొంత ధ్వంసమైనట్లు అద్దెకుండే స్థానికులు పేర్కొన్నారు. ఒక్కసారిగా పిడుగుపడటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం