హన్మకొండలో నేడు ప్రతిమ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

నేడు హన్మకొండ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్

హన్మకొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాట్లను పరిశీలించారు. ములుగు రోడ్డులో అధునాతన సదుపాయతో నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్సి స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ఆయన ప్రారంభించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో వరంగల్ కు వెళతారు.

11:15 గంటలకు ఆసుపత్రిని, వైద్య కళాశాలను ఆయన ప్రారంభిస్తారు. అధికారికంగా ఖరారు కాకపోయిన వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నట్లు సమాచారం. కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకళ్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఈ ఆసుపత్రి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందనుంది. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం