దేశంలో నేడు 5జీ (5G) టెలికాం సేవలకు ప్రధాని శ్రీకారం

అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం

న్యూదిల్లీ: దేశంలో నేడు 5జీ (5G) టెలికాం సేవలకు ప్రధాని మోదీ (PM Modi) శ్రీకారం చుట్టనున్నారు.  అధికారికంగా ప్రధాని మోదీ (PM Modi) 5జీ (5G) టెలికాం సేవలను ప్రారంభించనున్నారు. శనివారం దిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన హాజరై అత్యాధునిక 5జీ (5G) సేవలను ప్రారంభిస్తారు. మోదీ మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంతో పాటు 5జీ (5G) సేవలకు శ్రీకారం చుడతారు.

అక్టోబర్ 1 నుంచి 4 వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం జరగనుంది. అయితే ఈ 5జీ (5G) సేవలు తొలుత ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందనున్నాయి. వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ (5G) సేవలు అందుబాటులోకి రానున్నాయి. 4జీ తో పోలిస్తే 5జీ (5G)లో 7 నుంచి 10 రేట్ల డేటా వేగం ఉంటుంది. 5జీ (5G) రాకతో కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలు సాధ్యాం కానున్నాయి. స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన దేశంలోని 3 ప్రైవేటు టెలికాం సంస్థలు రూ.1.5 లక్షల కోట్లతో మూడు సంస్థలు స్పెక్ట్రమ్ కొనుగోలు చేశాయి.  


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం