కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

రూ.36.5 తగ్గిన కమర్షియల్‌ సిలిండర్ ధర

న్యూదిల్లీ: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త అందించాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.36.5 తగ్గింది. అదే విధంగా దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.25.50 తగ్గించాయి. ధరల తగ్గింపుతో దిల్లీలో సిలిండర్‌ ధర రూ.1859కి చేరింది. వాణిజ్య సిలిండర్‌ ధర కోల్‌కతాలో రూ.1959, ముంబయిలో 1811.5, చెన్నైలో రూ.2009.5గా ఉంది.

ఇక హైదరాబాద్‌లో రూ.36.50 తగ్గడంతో రూ.2099.5గా ఉన్న సిలిండర్‌ రూ.2064కు పడిపోయింది. ఇదిలా ఉండాగా, ఈఏడాది గరిష్ఠస్థాయికి చేరిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు గత జులై నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై నెలలో రూ.135, ఆగస్టులో రూ.36 మేర తగ్గిన ధర సెప్టెంబర్‌ 1న మరో రూ.91.50 మేర తగ్గింది. తాజాగా రూ.25.5 తగ్గింది. అయితే గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం