ఉక్రెయిన్ లోని 4 ప్రాంతాలు రష్యాలో విలీనం: పుతిన్ (Putin) ‌

డొనెట్క్స్‌, లుహాన్స్‌, జపోరిజియా, ఖేర్సన్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం

మాస్కో: ఉక్రెయిన్లోని 4 ప్రాంతాలు రష్యాలో విలీనం కానున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) పేర్కొన్నారు. ఈ మేరకు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించుకున్న డొనెట్క్స్‌, లుహాన్స్‌, జపోరిజియా, ఖేర్సన్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ (Putin)‌ శుక్రవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందాలపై ఆయన సంతకం చేశారు. మాస్కోలోని క్రెమ్లిన్‌ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆ నాలుగు రీజియన్లకు సంబంధించిన నేతలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చర్చలకు రావాలని ఉక్రెయిన్‌ను ఆహ్వానించిన ఆయన.. విలీన ప్రాంతాలను మాత్రం వదులుకునేది లేదని స్పష్టంచేశారు. నాలుగు ప్రాంతాల విలీన ప్రక్రియ వచ్చేవారం రష్యా పార్లమెంటు ఆమోదించనున్నట్లు అధ్యక్షుడు వాద్లమిర్ పుతిన్ (Putin) ప్రకటించారు. కాగా, నాలుగు ప్రాంతాల విలీనంపై అధ్యక్షుడు పుతిన్ (Putin) ఒప్పందాన్ని రష్యా పార్లమెంటు ఆమోదించనుంది. ఉక్రెయిన్ కు చెందిన 15 శాతం భూభాగం రష్యాలో కలవనుందని పుతిన్ (Putin) ఈ మేరకు స్పష్టం చేశారు. అంతే కాకుండా మా భూభాగాలను కాపాడుకునేందుకు దేనికైనా సిద్దంగా ఉన్నామని అధ్యక్షుడు వెల్లడించారు. ఇదిలా ఉండగా, పుతిన్ (Putin) ప్రకటన పనికిరానిదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ధ్వజమెత్తారు. వాస్తవాలను ఎవరూ మార్చలేరని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా బలగాలు క్షిపణులు, రాకెట్లు, డ్రోన్‌ దాడులతో విరుచుకు పడుతున్నాయి. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం