దేశంలో అదుపులోనే కరోనా (Corona) కేసులు

కొత్తగా 3,805 కరోనా (Corona) కేసులు

న్యూదిల్లీ: దేశంలో కరోనా (Corona) కేసులు అదుపులోనే ఉండగా, రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 3,805 మంది కరోనా (Corona) బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,45,91,112కు చేరాయి. ఇక గత 24 గంటల్లో 13 మంది మృతిచెందగా, 5069 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.

కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.29 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కరోనా (Corona) కేసులతో కలుపుకుని 4,40,24,164 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,655 మంది మరణించారు. మరో 38,293 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో 0.09 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.73 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 218.68 కోట్ల కరోనా (Corona) వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox