నాగాలాండ్‌లో సాయుధ బలగాల చట్టం ఆరు నెలలపాటు పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

న్యూదిల్లీ: సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (AFSPA) అమలును మరో ఆరు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు నాగాలాండ్ లోని  (Nagaland) తొమ్మిది జిల్లాల్లో అందులో నాలుగు జిల్లాల్లోని 16 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను కల్లోలిత ప్రదేశాలుగా కేంద్రం గుర్తించింది. నేటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

అదేవిధంగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని తిరప్‌, చంగ్‌లాంగ్‌, లాంగ్‌డింగ్‌, నమ్‌సాయ్‌ జిల్లాలోని నమ్‌సాయ్‌, మహాదేవ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ చట్టం అమల్లో ఉంటుందని వెల్లడించింది. స్థానికంగా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని ఏఎఫ్‌ఎస్పీఏను (AFSPA) మరో ఆరు నెలల పాటు పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ఈ చట్టం అమల్లో ఉంటుంది.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox