దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభం

తొలుత 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి.. ప్రధాని మోదీ ఆవిష్కరణ

న్యూదిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికాం సేవలు భారత్ లో ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి 5జీ టెలికాం సేవలను  ప్రారంభించారు. దిల్లీలోని దిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన హాజరై అత్యాధునిక 5జీ (5G) సేవలను ప్రారంభించారు. మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఆరవ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 ప్రారంభించిన ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాల గురించి వాటి ప్రతినిధులు ప్రధానికి వివరించారు.

కాగా, నేటి నుంచి ఈనెల 4 వరకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం దిల్లీలో జరగనుంది. అయితే ప్రగతి మైదాన్ లో ఏర్పాటు చేసిన 5జీ సేవలకు సంబంధించిన ప్రదర్శనను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఈ సేవల సామర్థ్యానికి సంబంధించిన డెమోను రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, మోదీకి వివరించారు. 5జీ సేవలు తొలుత 13 నగరాల్లో ప్రారంభమై వచ్చే కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. 5జీ పొందిన నగరాల్లో హైదరాబాద్, కోల్ కతా, లఖనవూ, ముంబయి, పూణె, జామ్ నగర్, గాంధీనగర్, గురుగ్రామ్, చండీగఢ్, చెన్నై, దిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలు ఉన్నాయి.  


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం