లోదుస్తు‌ల విష‌యంలో వెనక్కు తగ్గిన పాకిస్థాన్ ఎయిర్ లైన్స్

ఆదేశాలపై పీఐఏ శుక్రవారం క్షమాపణలు

ఇస్లామాబాద్: లోదుస్తుల విషయంలో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ వెనక్కి తగ్గింది. లోదుస్తుల విషయంలోనూ సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలని గురువారం పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలపై తీవ్ర  విమర్శలు రావడంతో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అధికారులు వెనక్కు తగ్గారు. ఈ ఆదేశాలపై పీఐఏ శుక్రవారం క్షమాపణలు కోరింది.

"తమ ఉద్దేశం అది కాదని, సరైన వస్త్రధారణతో విధులకు హాజరు కావాలన్నదే తమ అభిప్రాయమని పేర్కొంది". అయితే, భావాన్ని వ్యక్తీకరించే క్రమంలో తప్పు జరిగిందని పీఐఏ చీఫ్ హెచ్ఆర్ ఒకరు తెలిపారు. ఆదేశాల్లో వాడిన పదాలు సరిగా లేవన్నారు. సిబ్బంది మనసుల్ని నొప్పించినందుకు క్షమించాలని ఆయన కోరారు. అయితే సంస్థ పరువుకు భంగం వాటిల్లేలా కొందరు ఈ అంశాన్ని ట్రోల్ చేయడం బాధాకరమని వారు పేర్కొన్నారు. 


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం