విద్య, నైపుణ్యాభివృద్ధిలో 5జీ విప్లవాత్మక మార్పులు తెస్తుంది: ముకేశ్ అంబానీ (Mukesh Ambani)

5జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ప్రసంగం

న్యూదిల్లీ: విద్య, నైపుణ్యాభివృద్ధిలో 5జీ విప్లవాత్మక మార్పులు తెస్తుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ (Mukesh Ambani) పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికాం సేవలు భారత్ లో ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి 5జీ టెలికాం సేవలను  ప్రారంభించారు. దిల్లీలోని దిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన హాజరై అత్యాధునిక 5జీ (5G) సేవలను ప్రారంభించారు. మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మాట్లాడుతూ... గ్రామాలకు వైద్య రంగం విస్తరణకు 5జీ దోహదపడుతుందని పేర్కొన్నారు. 5జీ టెక్నాలజీ అందరికి డిజిటల్ కామధేను అవుతుందన్నారు. తక్కువ ధరలోనే అత్త్యుత్తమ 5జీ సేవలు అందిస్తామన్నారు. 2023 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామానికి 5జీ సేవలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం