లాడ్జిలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం

తిరుపతిలో ఘటన.. దర్యాప్తు చేపడుతున్న పోలీసులు

తిరుపతి: తిరుపతిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. యువతీకి ఇటీవల వేరే యువకుడితో వివాహమైంది. ప్రేమ వ్యవహారంతో వీరిద్దరూ ఇలా చేసినట్లు తెలుస్తోంది. గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడవీధిలోని ఓ లాడ్జిలో నిన్న ఉదయం 7 గంటలకు దిగిన వీరిద్దరూ, ఇవాళ ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. యువతి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కు చెందిన అనూషగా గుర్తించగా, యువకుడు హైదరాబాద్ కు చెందిన కృష్ణారావుగా గుర్తించారు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు  గల కారణాలను ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox