రానున్న రెండు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.!
రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం
అమరావతి: రానున్న రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం పరిసరాల్లో 7.6 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని వివరించారు. అల్పపీడనం ఈనెల 12 లోగా తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం చేరుకునే అవకాశముందని తెలిపారు. దీంతో దక్షిణకోస్తా, రాయలసీమలో ఈనెల 10,11 న మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురివనున్నాయి. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox