ప్రధానితో జనసేన అధినేత పవన్ భేటీ

రేపు విశాఖ పర్యటనకు వెళ్లనున్న పవన్

ఆంధ్రప్రదేశ్: ఏపీ పర్యటనకు రానున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ రానున్న ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ రేపు విశాఖ పర్యటనకు బయలుదేరనున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న పవన్ నేరుగా విశాఖ చేరుకుంటారు. విశాఖ చేరిన తర్వాత శుక్రవారమే పవన్ కల్యాణ్ ప్రధానితో బేటీ అవుతారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆయన ప్రధానికి వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ 2 రోజుల పాటు విశాఖలోనే వుంటారు. అయితే ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీ పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు పవన్ హాజరవుతారా? లేదా? అన్న  విషయాలు తెలవాల్సిఉంది.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం